‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ సాంగ్ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.
Also Read : Tvk Vijay : జననాయగన్ ఆడియో లాంచ్ కోసం మలేషియాలో భారీ ఈవెంట్
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ అభిమానులు, సినీ ప్రేమికుల్లో జోష్ నింపింది. దేవి శ్రీ మ్యూజిక్, పవర్ స్టార్ అద్భుతమైన డాన్స్ తో అదరగొట్టారు. వింటేజ్ స్టైల్, రా ఇంటెన్సిటీతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పవర్ స్టార్ తన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ పాటల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తున్నారు.
ఈ పాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అనే బ్లాక్‌బస్టర్ త్రయం మళ్లీ కలిసింది. గతంలో చార్ట్‌బస్టర్ పాటలు, గుర్తుండిపోయే మాస్ ఎంటర్టైనర్లను అందించిన ఈ త్రయం, ‘దేఖ్‌లేంగే సాలా’తో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. పదునైన దృష్టి, విశిష్టమైన సంగీత అవగాహనకు పేరుగాంచిన దర్శకుడు హరీష్ శంకర్.. మాస్, ఆధునిక అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ పాటలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు. ప్రతి బీట్, ప్రతి స్టెప్, ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రిలీజ్ అయిన దేఖ్‌లేంగే సాలా సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో నిలిచింది.