ప్రియురాలి కోసం అధికారిక జెట్‌ను ఉపయోగించడంపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. షట్‌డౌన్ కారణంగా జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేసేందుకు జెట్‌లో తిరుగుతున్నారంటూ వివాదం జరిగింది.
ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం హడలెత్తించింది. సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు.
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా.. విపత్తు సంభవించినా సాయం చేసేందుకు భారతదేశం ముందుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది.
కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.