దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 88 స్థానాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సెకండ్ విడతలో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో మాయవతి పార్టీకి చెందిన బీఎస్పీ అభ్యర్థి మృతిచెందడంతో పోలింగ్ షెడ్యూల్‌ను మార్చారు.
తన తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో చిరుత హీరోయిన్ నేహా శర్మ దూసుకుపోతున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో తన తండ్రితో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత్ స్పందించింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమానికి ఆయన తల్లి కూడా హాజరయ్యారు
దేశంలో ఎండలు మండుతున్నట్లుగానే.. రాజకీయ నాయకుల మాటలు కూడా మండితున్నాయి. ప్రచారంలో నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. పోలింగ్ సమయాలు దగ్గర పడే కొద్దీ ప్రసంగాలు కూడా హీటెక్కుతున్నాయి.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
శుక్రవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది.
సార్వత్రిక ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు.