శుక్రవారం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ బాంబ్ పేల్చింది. పోలింగ్ జరగబోయే రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు సంబంధించి గురువారుం నమోదైన ఉష్ణోగ్రతల లిస్టును ఐఎండీ విడుదల చేసింది. ఒడిశాలోని ఝర్సుగూడ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ఇక కోల్‌కతాలోనూ భారీగానే ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Aa Okkati Adakku: అందరికీ కనెక్ట్ అయ్యే కథ.. ఫస్ట్ ఛాయిస్ ఆయనే : నిర్మాత రాజీవ్ ఇంటర్వ్యూ
ఇదిలా ఉంటే మరిన్ని రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ ఎఫెక్ట్ పోలింగ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఎన్నికల సంఘం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆయా ఏర్పాట్లు చేసినా.. ఓటు వేసేందుకు ప్రజలు భయపడతారేమోనని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది. కానీ ఇక్కడ రెండు గంటల పాటు పొడిగించారు. అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Odisha: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడంటే.?
శుక్రవారం జరిగే రెండో విడత పోలింగ్‌లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని మొత్తం 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర 08, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు స్థానాల చొప్పున, అస్సాం, బీహార్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో రాష్ట్రంలో 03 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకి ఎన్నికలు జరగనున్నాయి.
