శుక్రవారం దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే పశ్చిమబెంగాల్లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే.. ఇంకోవైపు సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులకు తెగబడింది.
అమెరికాలో మరో దారుణం జరిగింది. 2020లో అమెరికాలో పోలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లిజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిండ్ తరహాలోనే.. మరో నల్లజాతీయుడు మృత్యువాత పడ్డాడు. ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తికి (53) సంకెళ్లు వేస్తూ.. మరొకరు మెడపై మోకరిల్లి.. కొన్ని సెకన్లు పాటు ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
నీటి సమస్యను తీర్చమన్న పాపానికి ఓ కేంద్ర మంత్రి భార్య.. మహిళలపై చిందులు తొక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఖలిస్థాన్ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృతపాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇటీవల ఆయన న్యాయవాది ప్రకటించారు. తాజాగా దీనిపై కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు.
పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు.
తైవాన్ను మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది