ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దుర్మరణం చెందారు. మృతుడు హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన వాసిగా గుర్తించారు.
దక్షిణ భారత్‌కు కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని గుడ్‌న్యూస్ చెప్పింది. వేడి గాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందవచ్చని పేర్కొంది. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత్‌లో భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయించిన దగ్గర నుంచి నిప్పులు చిమ్ముతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి […]
డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడారు.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు 2 నెలల మధ్యంతర బెయిల్‌ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది.
తమిళనాడులోని చెన్నైలో దారుణం జరిగింది. రెండు రోట్వీలర్స్.. ఐదేళ్ల చిన్నారిపై దాడికి తెగబడ్డాయి. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటినా తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
క్రికెట్ బాల్ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మహారాష్ట్ర పూణేలోని లోహెగావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఈ దారుణం జరిగింది.
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు.