క్రికెట్ బాల్ ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మహారాష్ట్ర పూణేలోని లోహెగావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ దారుణం జరిగింది. కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గత వారం జరిగిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

స్కూళ్లకు వేసవి సెలవులు రావడంతో చిన్నారులు స్నేహితులతో కలిసి ఆయా ఆటలు ఆడుకోవడం సహజమే. కొన్ని సార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలతో ప్రాణాలు పోవడం బాధాకరం. శంభు కాళిదాస్ అలియాస్ శౌర్య అనే 11 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఇంతలో క్రికెట్ బాల్ వచ్చి జననాంగాలకు తగిలింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్నేహితులు వచ్చి సపర్యాలు చేసినా స్పందించలేదు.
ఇది కూడా చదవండి: OTT Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు..
శౌర్య బౌలింగ్ చేస్తుండగా.. బ్యాటర్ కొట్టిన స్ట్రైక్‌కి నేరుగా ప్రైవేటు భాగాలపై బలంగా తగిలింది. దీంతో శౌర్య అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే శౌర్య ప్రాణాలు వదిలాడు. కళ్ల ఎదుటే శౌర్య కుప్పకూలిపోవడంతో స్నేహితులు దిగ్భ్రాంతికి గురికావడంతో పాటు భయాందోళనకు గురయ్యారు. వేగంగా స్పందించి ఆస్పత్రికి తీసికెళ్లినా ప్రాణాలు నిలువకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Danush 50: ‘రాయన్’ దిగుతున్నాడు గెట్ రెడీ.. ఇట్స్ అఫీషియల్..