కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. కాసర్గోడ్లో అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన శివకుమార్ (54), అతని కుమారులు శరత్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు.
రష్యా దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రష్యా దేశాధ్యక్షుడిగా మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయిదోసారి అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయనుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
ఆయనో ఓ రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి. ఎంతో దర్పం.. హోదా అనుభవించిన ఆయన.. కొద్ది రోజులు క్రితం అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
భారీ వర్షంతో టెక్ సిటీ బెంగళూరు తడిసిముద్దైంది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో బెంగళూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.