PM Modi: అయోధ్య రాముడ్ని దర్శించుకున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రామమందిరానికి చేరుకుని రాముడ్ని దర్శించుకున్నారు. పండితులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన అయోధ్య రాముడ్ని మోడీ దర్శించుకున్నారు. ప్రధాని మోడీ.. విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేశారు. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు.
ఇది కూడా చదవండి: KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఆలయ ప్రవేశ ద్వారాలు పసుపు రేకులతో ఏర్పాటు చేసిన ‘ఓం’ పూలతో అలంకరించబడ్డాయి. పూలతో తయారు చేసిన విల్లు మరియు బాణం యొక్క ప్రతిరూపాలు కూడా వివిధ ప్రదేశాలలో కనిపించాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం.. ఆలయంలో కూర్చున్న రామ్ లల్లా ఆదివారం లేత గులాబీ రంగు దుస్తులు ధరించారు.
ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
అయోధ్య జిల్లా పరిధిలోకి వచ్చే ఫైజాబాద్ లోక్‌సభ స్థానానికి మే 20న ఐదవ దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఆలయ సందర్శన అనంతరం ప్రధాన మంత్రి మెగా రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఫైజాబాద్ అభ్యర్థి లల్లూ సింగ్ ఆయన వెంట ఉన్నారు. ప్రధాని వాహన శ్రేణి వెళ్లడంతో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. చీర కట్టుకున్న మహిళల బృందం ప్రధాని వాహనం ముందు నడిచింది. ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రారంభమైన రోడ్‌షో రెండు కిలోమీటర్ల దూరంలోని నయా ఘాట్ రోడ్ క్రాసింగ్ వద్ద ముగిసినట్లు పార్టీ అధికారులు తెలిపారు.
తోటి భారతీయుల క్షేమం కోసం అయోధ్య రాముడ్ని ప్రార్థించినట్లు మోడీ ట్వీట్ చేశారు. 140 కోట్ల మంది భారతీయులు క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
At Ayodhya, prayed to Prabhu Shri Ram for the well being of my fellow 140 crore Indians. pic.twitter.com/ulwNmktZ2e
— Narendra Modi (@narendramodi) May 5, 2024
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!