Sonia gandhi: జూన్ 2 తెలంగాణకు సోనియా రాక.. రాష్ట్ర గీతం ఆవిష్కరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దాదాపు 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ‘నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా’.. విరాట్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
ఇదిలా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి మరియు గేయ రచయిత అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4 న కేబినెట్ అధికారికంగా రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రివర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
ఇది కూడా చదవండి: Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని చూస్తారు..
ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అందె శ్రీ, కీరవాణిలు కలిసి పాటపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారి పనిని అభినందించారు. ఈ సమావేశంలో అందె శ్రీ సవరించిన గీతాన్ని ప్రదర్శించారు. ఈ పాటను జూన్ 2న విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ముఖ్యమంత్రి సీపీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు అధికారిక రాష్ట్ర గీతం లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అందె శ్రీ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా పరిగణించలని నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
-
Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?