రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ భౌతికదాడికి తెగబడ్డారు.
ఈ మధ్య విమానాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ ప్యాసింజర్.. ఏకంగా మరో ప్యాసింజర్‌పై మూత్రం పోసిన సంఘటన తెలిసిందే. అటు తర్వాత మరికొంత మంది జుగ్సుపకరంగా ప్రవర్తించిన సంఘటనలు చూశాం.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసింది. ఇక ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్ సహా నిందితులందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. సూర్యుడు సుర్రుమంటున్నాడు.
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. బ్రిటీష్ పర్యాటకులపై బౌన్సర్లు దాడికి తెగబడ్డారు. వారిపై ఇష్టానుసారంగా దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు గాయాలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో నాయకులంతా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్‌పై మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు ముగిశారు. సోమవారం కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.
పాట్నా కాలేజీలో దారుణం జరిగింది. బీఎన్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో ఇంగ్లీస్ చదువుతున్న థర్డ్ ఇయర్ విద్యార్థి హర్ష్ రాజ్(22)ను ముసుగులు ధరించిన 10-15 మంది దుండగులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రెమల్ తుఫాన్ పశ్చిమబెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి ఆడవాళ్ల ఫైటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకోవడం.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.