పాట్నా కాలేజీలో దారుణం జరిగింది. బీఎన్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో ఇంగ్లీస్ చదువుతున్న థర్డ్ ఇయర్ విద్యార్థి హర్ష్ రాజ్(22)ను ముసుగులు ధరించిన 10-15 మంది దుండగులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాని నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది దాండియా సందర్భంగా జరిగిన గొడవకు చెందిన పాత కక్షతో యువకుడి జీవితాన్ని అగంతకులు బలి తీసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సోమవారం పరీక్ష రాయడానికి సుల్తాన్‌గంజ్ లా కాలేజీకి రాగా.. అక్కడ ముసుగులు ధరించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హర్ష్ రాజ్ ప్రాణాలు వదిలాడు.
ఇది కూడా చదవండి: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
గతేడాది దసరా సందర్భంగా జరిగిన దాండియా కార్యక్రమంలో జరిగిన గొడవతో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని.. ఆ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుందన్నారు. ఆ నాటి ఘర్షణే ఈ హత్యకు దారితీసిందని పేర్కొన్నారు. 302 సెక్షన్ (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఇక ప్రధాన నిందితుడు చందన్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. మిగతా నిందితుల్ని పట్టుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ దాడికి జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలలోని ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. బాధితుడ్ని దుండగులు కర్రలతో కొట్టినట్లుగా వీడియోలో కనిపించింది. విజువల్స్‌లో ఉన్న మిగతా నిందితుల్ని కూడా పట్టుకుంటామని వెల్లడించారు. విద్యార్థి హత్య బాధాకరమని బీహార్ మంత్రి అశోక్ చౌదరి తెలిపారు. దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Praja Bhavan: ప్రజా భవన్కు బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు
ఈ ఘటనపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది చాలా దురదృష్టకరమని.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ధ్వజమెత్తాయి. పరిపాలన చేతగావడం లేదని… దోషులను త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Haryana: ఇదేందయ్యా ఇది..పోర్షే లగ్జరీ కారులో ఎండుగడ్డి తీసుకెళ్లిన రైతు
#WATCH | Patna: On a student beaten to death in a college in Patna, Former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav says, " It is very sad, law and order is deteriorating since NDA govt has come to power (in Bihar)…strictest action must be taken against the accused and… pic.twitter.com/u5UVHDyBV7
— ANI (@ANI) May 28, 2024