దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి ఆడవాళ్ల ఫైటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకోవడం.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: NSA Ajit Doval: ఇజ్రాయెల్ పై అజిత్ దోవల్ ప్రశంసలు.. ఏమన్నారంటే?
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడటానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. మెట్రో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అయినా కూడా ఆ సమయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ పడడం… తోటి ప్యాసింజర్స్ అలానే చూస్తూ ఉండిపోయారు. చివరికి కొట్టుకోవడం వరకూ దారితీసింది. ముందుగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. అనంతరం భౌతికదాడికి దిగారు. కొద్దిసేపటి తర్వాత మెట్రోలోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో ఆ మహిళల మధ్య గొడవ సద్దుమణిగింది. ఈ సమయంలో ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalesh b/w Two Ladies Inside Delhi Metro over Push and Shove
pic.twitter.com/yLgV3DgiWH— Ghar Ke Kalesh (@gharkekalesh) May 24, 2024