పచ్చని సంసారంలో అక్రమ సంబంధం అగ్గిరాజేసింది. కుటుంబాన్ని ముక్కలు చేసింది. మనస్తాపంతో వివాహిత అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది.
నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైక్ కట్ చేశారన్న ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. సమావేశంలో మాట్లాడేందుకు అందరికీ నిర్ణీత సమయాన్ని కేటాయించినట్లు ఆమె తెలిపారు.
జూలై 26 వరకు 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. 2024-25 కోసం జూలై 26 వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులకు పాఠాలో బోధించాల్సిన మహిళా ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లోనే హాయిగా నిద్రపోయింది.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డ్రస్‌కు తగ్గట్టుగా ఆమె మ్యాచింగ్ బ్లాక్ గ్లాసెస్ ధరించింది. ఆమెను గుర్తుపట్టలేకపోయారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మద్దతుగా నిలిచారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. శనివారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.