లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. ఈ సందర్భంగా అతడి సాధకబాధకాలు తెలుసుకున్నాక.. చెప్పులు తీసుకుని రాహుల్ కుట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు.. అతడు కూడా భలే ఫేమస్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: NEET Case: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు
తాజాగా రాహుల్ కుట్టిన చెప్పులకు భలే గిరాకీ పెరిగింది. రూ.10 లక్షలకు ఇవ్వాలంటూ ఒకరు ఆఫర్ చేశారు. అంతేకాదు.. అనేక మంది షాపు దగ్గర ఆగి అతడిని అభినందిస్తున్నారు. ఇంకొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో అతని దుకాణానికి తాకిడి పెరిగింది. దీంతో రాహుల్ గాంధీకి చెప్పులు కుట్టే వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు.
పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్‌కు రాహుల్ వెళ్తుండగా చెప్పులు కుట్టే రామ్ చెట్ దుకాణం దగ్గర ఆగారు. అతడితో మాట్లాడుతూ చెప్పు కుట్టేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రాహుల్ పర్యటన తర్వాత తన జీవితం మారిపోయిందని చెప్పులు కుట్టే రామ్ తెలిపాడు. ప్రజలు తమ బైక్‌లు, కార్లు ఆపి తనను పిలుస్తున్నారన్నారు. అంతేకాకుండా గౌరవం కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఒక కాలర్ రూ. 10 లక్షల వరకు రాహుల్ కుట్టిన చెప్పులు కొనేందుకు ఆఫర్ చేసినట్లు చెప్పాడు. ఒక వ్యక్తి నగదుతో కూడిన బ్యాగ్‌లను అందించాడని.. కానీ తాను తిరస్కరించినట్లు చెప్పాడు. తాను వాటిని విక్రయించనని చెప్పాడు. ఇక నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.