షేక్ హసీనా.. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన మహా నేత. ఎంతో ఘనకీర్తిని సంపాదించింది. కానీ ఒక్క రోజులోనే చరిత్ర తల్లకిందులైంది. ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పి విదేశాలకు పారిపోయింది.
రాజ్యసభలో మరోసారి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో చైర్మన్ సంబోధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.
బెంగళూరులో ఘోరం జరిగింది. వివాహిత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై బంధువులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు వదంతులు నమ్మొద్దని కోరారు.
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గాడితప్పడంతో ఆ ప్రభావం పొరుగు దేశాలపైన ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢిల్లీ చేరుకున్న షేక్ హసీనా.. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు.