బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది.
వయనాడ్ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 405కి చేరింది. గత మంగళవారం అర్ధరాత్రి వచ్చిన విలయంతో వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. బురదలో కూరుకుపోయి నివాసితులు చనిపోయారు.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. యువతి ప్రేమను తిరస్కరించిందని యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండ్య జిల్లాలోని దేవలాపూర్ హోబలి తాలూకాలో జరిగింది.
ఫేమస్ కోసమో.. లేదంటే వీడియో వైరల్ కోసమో తెలియదు గానీ.. ఈ మధ్య యువత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రమాదమని తెలిసి కూడా కొందరు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.