బంగ్లాదేశ్‌లో హింసాకాండ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు వదంతులు నమ్మొద్దని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు చేయూత అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా మనం అండగా నిలవాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పరిణామాలపై రాజకీయ పార్టీలు కూడా అనవసర వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు కామెంట్స్ చేశారని.. వాళ్లు కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సిందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి
అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 5:30కి హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. అక్కడ ఆర్మీ అధికారులు స్వాగతం పలికారు. ఇక ఢిల్లీ చేరుకున్న హసీనాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఢాకాలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఢిల్లీ నుంచి హసీనా లండన్‌కు వెళ్లిపోనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Maharashtra Assembly Elections: ఇండియా కూటమికి ఆప్ షాక్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే..!