Sheikh Hasina: నిరసనకారుల అమానుషం.. షేక్ హసీనా దుస్తులు వేసుకుని ప్రదర్శన
- బంగ్లాదేశ్‌లో నిరసనకారుల అమానుషం
- షేక్ హసీనా దుస్తులు వేసుకుని ప్రదర్శన
- సోషల్ మీడియాలో మండిపడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేక్ హసీనా.. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన మహా నేత. ఎంతో ఘనకీర్తిని సంపాదించింది. కానీ ఒక్క రోజులోనే చరిత్ర తల్లకిందులైంది. ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పి విదేశాలకు పారిపోయింది. నిరసనకారుల దెబ్బకు ఆమె తోక ముడిచి పరారైంది. ఇప్పుడు దేశ రాజధాని ఢాకా నిరసనకారుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ప్రధానమంత్రి అధికారిక నివాసం కుక్కలు చింపిన విస్తరాకులా అయిపోయింది. ఇన్నాళ్లు షేక్ హసీనా ఉపయోగించిన వస్తువులను, దుస్తులను ఆందోళనకారులు లూటీ చేశారు. ఏది దొరికితే అది తీసుకుని వెళ్లిపోయారు. ఇంకొందరు మంచాలపై పడుకుని ఎంజాయ్ చేశారు.

Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ఇదిలా ఉంటే కొందరు నిరసనకారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన షేక్ హసీనా ఒక మహిళ అన్న గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఆమె ధరించిన చీరలు.. లోదుస్తులను దొంగిలించి నిరసనకారులు వేసుకుని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుస్తులు, ఫర్నిచర్, పశువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. ఒక చిత్రంలో ఒక వ్యక్తి చీర కట్టుకుని, ప్లాస్టిక్ బకెట్‌తో బట్టలతో నిండుగా తీసుకెళ్తుండగా… మరొక యువకుడు ఊదారంగు జాకెట్టును పట్టుకున్నట్లు చూపించాడు. షేక్ హసీనా వ్యక్తిగత వస్తువులను దోచుకోవడం మరియు బహిరంగంగా ప్రదర్శించడాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు.
సోమవారం కోటా ఉద్యమం తీవ్రం అవ్వడంతో షేక్ హసీనా.. ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అనంతరం ఆమె ఢిల్లీ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కోటా ఉద్యమం కారణంగా బంగ్లాదేశ్‌లో 300 మంది నిరసనకారులు ప్రాణాలు వదిలారు.
Where is humanity
This is totally disgusting
Murder of democracy
Radicals looted bra, fish, saree, blouse, evn dustbins from Sheikh Hasina's residence.
One ri0ter even wore a saree.
They have looted utensils from her kitchen. pic.twitter.com/r2yFeTSqd9— ThakurAbhi (@thakurabhi3880) August 5, 2024
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!