Bengaluru video: వాకింగ్ చేస్తుండగా మహిళపై దుండగుడు దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- బెంగళూరులో రెచ్చిపోయిన దుండగుడు
- మహిళపై దుండగుడు దాడి.. కేకలు వేయడంతో పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. మహిళను బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. వాకింగ్‌కు వెళ్లేందుకు స్నేహితురాలి కోసం నిరీక్షిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వ్యక్తి అమెను పట్టుకుని లైంగికంగా వేధించాడు. దీంతో అతడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీయగా వెంటపడ్డాడు. దీంతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన ఉదయం 5 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది.
ఇది కూడా చదవండి: Infinix Note 40x 5G: తక్కువ ధరలో ఐఫోన్ 15 లుక్‌తో వచ్చేస్తున్న ఇన్ఫినిక్స్ 5G మొబైల్..
Also Read
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
బాధితురాలు ఓ ఇంటి ముందు నిలబడి ఉంది. అక్కడి నుంచి ఓ వైపు నడుచుకుంటూ వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి.. ఆమెని వెంబడించాడు. చుట్టూ ఎవరు లేకపోవడంతో ఆమెని వెనుక నుంచి బలవంతంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ముద్దు పెట్టాడు. పరుగులు పెడుతూ కేకలు వేసింది. దీంతో అక్కడి నిందితుడు నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Air India: బంగ్లాదేశ్ అల్లర్లు.. ఢాకాకు విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మహిళ రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్తుందని చెప్పారు. తన స్నేహితురాలి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమె వేధింపులకు గురైందన్నారు. దుండగుడు తెల్ల చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. కేకలు వేయడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సెక్షన్ 76, 78, మరియు 79 కింద వ్యక్తిపై కేసు నమోదు చేశామని.. అతని జాడ కోసం గాలింపు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ భర్తపై కూడా కేసు పెట్టినట్లు కూడా వారు తెలిపారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని, మహిళల భద్రత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుని విచారిస్తామని సౌత్ డీసీపీ లోకేశ్ జగలసర్ తెలిపారు. పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
In shocking incident from Bengaluru, Karnataka, a woman was recently molested by an unknown assailant while she was out for a morning walk in Krishna Nagar, Konanakunte area of the city. #Bengaluru #Karnataka #women pic.twitter.com/JMeUP3QLPV
— Ashutosh Kumar (@Ashutos59663780) August 5, 2024
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!