ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై ఆందోళనకారుల నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. సోమవారం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పరారయ్యారు. దీంతో నిరసనకారులు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ కేబినెట్లో కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉదయనిధి.. డిప్యూటీ సీఎం కాబోతున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. భారత్- బంగ్లా సరిహద్దులో సైన్యం భారీగా మోహరించింది. దీంతో బీఎస్ఎఫ్ హైఅలర్ట్ ప్రకటించింది.
నిరసనకారుల ఆందోళనతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ లేదా లండన్‌కు పారిపోయినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్‌ను తీవ్ర అల్లకల్లోలం చేసింది. ఎన్నడూ లేని విధంగా భారీ నష్టాలను చవిచూసింది. సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా మరింత దిగజారిపోయి భారీ స్థాయిలో నష్టాలను చవిచూసింది.
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలతో రక్తసిక్తమైంది. గత నెల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం ఆగస్టులో మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర హింసకు దారి తీసింది.
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు
ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు.
వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. మంగళవారం కొండచరియలు విరిగిపడి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. అనంతరం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చేపట్టిన సహాయ చర్యలు భారతీయుల్ని కట్టిపడేస్తున్నాయి.
త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇండియా కూటమి కూడా అధికారం కోసం కసరత్తు ప్రారంభించింది.