ఫేమస్ కోసమో.. లేదంటే వీడియో వైరల్ కోసమో తెలియదు గానీ.. ఈ మధ్య యువత హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రమాదమని తెలిసి కూడా కొందరు విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడో చోటు ఏదొక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా రీల్స్ చేసేవాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకోవైపు పోలీసులు శిక్షలు విధిస్తున్నా.. ఏ మాత్రం భయపడడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసంలో ఒక జంట రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..
లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం దగ్గర ఎస్‌యూవీ కారులో వెళ్తూ సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చిన జంట ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఓ వైపు కారు వేగంగా దూసుకెళ్తోంది. ఇంకోవైపు జంట ముద్దుల్లో మునిగిపోయారు. కారును వెంబడిస్తున్న బైకర్లు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయినా కూడా యువతలో మార్పు రావడం లేదు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఈనెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా.. విజయవంతం చేయాలి..
लखनऊ:-तहज़ीब ओ अदब का शहर इन दिनों गोमतीनगर जैसे इलाकों में हो रहा बदनाम,हुड़दंगियों के बाद प्रेमी जोड़े की अश्लीलता आई सामने,1090 चौराहे से मुख्यमंत्री चौराहे तक बेखौफ करते रहे अश्लील हरकतें, पुलिस रहीं नदारद,UP 78 GB 0130 नंबर गाड़ी की रूफ पर हो रहीं आशिक़ी @lkopolice pic.twitter.com/TUnURn53SO
— Anujjournalist9889 (@anujjournalist1) August 6, 2024