కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. యువతి ప్రేమను తిరస్కరించిందని యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండ్య జిల్లాలోని దేవలాపూర్ హోబలి తాలూకాలో జరిగింది.
హోసహళ్లికి చెందిన శరత్ అనే 30 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ఇష్టపడ్డాడు. అయితే ఆమె అతడి ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆవేశంలో యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం భయపడ్డాడో.. ఏమో తెలియదు గానీ.. వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Store Ginger Garlic: అల్లం వెల్లుల్లి చాలా రోజులు నిల్వ ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
యువతిపై దాడి చేసిన అనంతరం శరత్ తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి సునగనహళ్లిలో సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న రూరల్ పోలీస్‌స్టేషన్ పీఎస్‌ఐ రవికుమార్.. శరత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం శరత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే శరత్ హత్యాయత్నానికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు కెరగోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?