హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది.
అమెరికాలో ఓ పైలట్.. ప్రయాణికులకు షాకిచ్చాడు. అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత పైలట్ వ్యవహారించిన తీరుతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. స్కైవెస్ట్ నిర్వహించే 3491 విమానం వొమింగ్‌లోని జాక్సన్ హోల్ ఎయిర్ పోర్టుకు బయల్దేరింది.
శత్రు దేశానికి ఆమె విరాళం ఇవ్వడమే శాపమైంది. ఒక స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా సహాయం చేసింది. అదే ఆమెకు ముప్పు తెచ్చిపెట్టింది. దయాది దేశానికి విరాళం ఇచ్చినందుకు రష్యా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అంతే అమెరికా-రష్యన్ పౌరురాలికి ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్టోబర్‌లోనే శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి దెబ్బగా దెబ్బగా తలపడబోతున్నాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
అమెరికా ఎయిర్‌పోర్టులో ఒక మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. సిబ్బందిపై భౌతికదాడికి పాల్పడింది. అంతేకాకుండా చేతికి దొరికిన వస్తువుల్ని విసిరేసింది. అరుపులు, కేకలతో నానా రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మోడీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇండియా కూటమి రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.
ఓ మహిళా డాక్టర్ ఆస్పత్రిలోనే అత్యంత క్రూరంగా.. దారుణాతి దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడింది. ఈ ఘటన దేశ ప్రజల గుండెలను కలిచివేసింది. ఆమె పోస్టుమార్టం రిపోర్టును బట్టి ఎంత హింసాత్మకంగా హత్యాచారానికి గురైందో అర్ధమవుతుంది. మానవత్వం ఉన్న మనుషులంతా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూచనలు చేయడానికి బదులు క్యాంపస్‌లో భద్రతను పెంచాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.