దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెబీ ఛైర్మన్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఈ వారం నష్టాలను చవిచూసింది.
ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ మరియు అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది
బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ మరియు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్‌కతా చేరుకోనుంది. తొలుత ఆర్జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల తర్వాత కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై జాతీయ వైద్య కమిషన్ అప్రమత్తం అయింది. ఈ మేరకు మెడికల్ కాలేజీలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక సూచనలు చేసింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జేపీ నడ్డా వీడియో విడుదల చేశారు.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ట్రయల్ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 2 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగిసింది.