ప్రముఖ ఆస్ట్రియన్ బిలియనీర్ రిచర్డ్ లుగ్నెర్(91) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రెండు నెలల క్రితమే రిచర్డ్ ఆరో వివాహం చేసుకున్నారు. నిర్మాణ రంగంలో లుగ్నర్ విజయవంతమైన వ్యవస్థాపకుడిగా పేరు గాంచారు.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంతో ఆ జ్వాలలు మరింత రేకెత్తిస్తున్నాయి.
పారిస్ ఒలింపిక్ విజేత అర్షద్ నదీమ్‌పై పాకిస్థాన్‌లో ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురుస్తోంది. జావెలిన్ త్రోలో అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. దేశానికి స్వర్ణాన్ని సంపాదించిన క్రీడాకారుడిగా అర్షద్ రికార్డ్ సృష్టించాడు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో ప్రకటన చేసింది.
రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఆర్డీవో, ఆర్మీ సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెబీ ఛైర్పర్సన్ మధబి పూరిపై అమెరికా సంస్థ చేసిన ఆరోపణలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా అన్ని రంగాలు భారీ నష్టం దిశగా సాగాయి.
బంగ్లాదేశ్ అల్లర్లతో తమకు సంబంధం లేదని అమెరికా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ ప్రియరీ ఖండించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజలు ఎంచుకున్న నిర్ణయమని తెలిపారు. వారి భవిష్యత్‌ను నిర్ణయించుకునే అధికారం వారికే ఉందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇది తప్ప ఇంకేమీ ఆరోపణలు వచ్చినా అవన్నీ అవాస్తవమేనని జీన్ ప్రియరీ స్పష్టం చేశారు.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యార్థులు, నర్సులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. బాధితురాలి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి ప్రార్థిస్తున్నారు.
యూపీలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆ మధ్య అయోధ్యలో బాలికపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి గర్భం దాల్చడంతో ఈ ఘోరం రెండు నెలల తర్వాత వెలుగులోకి రావడంతో యోగి సర్కార్ నిందితుల్ని అరెస్ట్ చేయించింది. నిందితుల సమాజ్‌వాదీ పార్టీ నేతలేనని సీఎం యోగి ఆరోపించారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థి సంఘాలను తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ప్రశంసలతో ముంచెత్తారు. ఎలాంటి సందేహం లేదు... విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని ఆదివారం రాత్రి విద్యార్థులతో సమావేశం అనంతరం యూనస్ విలేకరులతో అన్నారు.