Rahul gandhi: ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి అవమానం!.. స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చివరిలో సీటు
- ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి అవమానం!
- స్వతంత్ర్య వేడుకల్లో చివరిలో సీటు
- కావాలనే అవమానించారంటూ నెటిజన్లు ఆరోపణలు
- ఖండించిన కేంద్ర రక్షణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మోడీ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఇండియా కూటమి రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. అధికారికంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అంటే కేంద్ర మంత్రికి ఉండే గౌరవం రాహుల్‌కి దక్కుతుంది. ఇక వాజ్‌పేయ్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత సోనియాగాంధీకి ముందు వరుసలోనే సీటు కేటాయించారు. కానీ మోడీ 3.0 ప్రభుత్వం మాత్రం రాహుల్‌ను అవమానించేలా వెనుక వరుసలో సీటు కేటాయించారని.. అది కూడా ఒలింపిక్స్ క్రీడాకారుల వెనుక కూర్చోబెట్టడం ఏంటి? అని నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్ సీటు కేటాయింపుపై సర్వత్రా తీవ్ర చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: OLA: ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 579 కి.మి!
Also Read
- Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
- Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
రాహుల్ సీటుపై తీవ్ర దుమారం చెలరేగడంతో రక్షణ శాఖ స్పందించింది. ఎర్రకోట దగ్గర రక్షణ శాఖే ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కేంద్రమంత్రులతో సమానంగా ముందు వరుసలోనే సీటు కేటాయించామని.. అయితే తాను ఒలింపిక్స్ క్రీడాకారుల దగ్గర కూర్చుంటానని రాహుల్ చెప్పడంతోనే అలా జరిగిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ముందు వరుసలో కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, నిర్మలా సీతారామన్, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, తదితరులు కూర్చున్నారు.
అయితే ఈ విషయంపై రాహుల్ స్పందించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. నేను ఎక్కడ ఉన్నా.. మీతోనే ఉంటా. మీలాగే ఉంటా. నిరంతరం భారతీయుల గొంతుకను అవుతాను’’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: తగ్గుతున్న హిందూ జనాభా.. అస్సాం భవిష్యత్తు ప్రమాదంలో ఉంది..
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!