కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఆనవాళ్లు చెరిపేందుకే మమత ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Nalin Prabhat: ఏపీకి చెందిన ఐపీఎస్.. ఉగ్రవాదుల ఏరివేతలో దిట్ట..ఇప్పుడు కశ్మీర్ డీజీపీగా పోస్టింగ్
ఇదిలా ఉంటే ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర ఆందోళన చేస్తున్న డాక్లర్లు, నర్సులకు రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ సంఘీభావం తెలిపారు. నిరసన తెలుపుతున్న వైద్యులకు తన మద్దతును ప్రకటించారు. ‘నేను మీతోనే ఉన్నాను’ అని ప్రకటించారు. ఆస్పత్రి దగ్గర విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీతో కలిసి పోరాడతానని భరోసా కల్పించారు. తాజా ఘటనలతో డాక్టర్లు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు. ఈ కేసు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బెంగాల్ మహిళ సంతోషంగా జీవించేలా పరిస్థితులు మారాలన్నారు. అల్లరిమూకల విధ్వంసంపై పోలీసులతో చర్చిస్తానని.. అనంతరం మీడియాతో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: US video: ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్
బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆర్‌జీ కర్ ఆస్పత్రి దగ్గర వైద్యుల జాగరణ సందర్భంగా అల్లరిమూకలు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి దౌర్జన్యానికి దిగారు. వాహనాలపై దాడి చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌తో పాటు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. 15 మంది పోలీసులు గాయపడ్డారని కోల్‌కతా పోలీసులు తెలిపారు.
ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అత్యంత క్రూరంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా తేలింది. గ్యాంగ్‌రేప్ కారణంగానే ఇంత వీర్యం ఉంటుందని వైద్యులు పేర్కొ్న్నారు. అలాగే బాధితురాలు తీవ్ర ప్రతిఘటన చేయడంతోనే ఆమెకు ఎక్కువ గాయాలు అయినట్లుగా అభిప్రాయపడుతున్నారు. అత్యంత హింసాత్మకంగా ఆమెపై దాడి జరిగిందని డాక్టర్లు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్..