Mumbai Dating Scam: డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ.. భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో బురిడీ
- భారీ బిల్లులతో బాధితులు లబోదిబో
- ముంబైలో వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లుంటారంట. లోకంలో సహజంగా వాడుతుంటారు. ఏదొక చోట.. ఎక్కడో చోట మోసాలు జరుగుతూనే ఉంటున్నాయి. అయినా కూడా అప్రమత్తం కాక.. చాలా మంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో కొత్త రకం డేటింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. అంతా అయిపోయాక… లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అసలు ఈ డేటింగ్ స్కామ్ ఏంటి? ఇందులో దాగి ఉన్న మోసం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని గాడ్‌ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్‌కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. తినేశాక.. ఇప్పుడే వస్తానంటూ మధ్యలో జారుకుంటుంది. ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో రూ.61, 743 బిల్లు చూసి బాధితుడు అవాక్కయ్యాడు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. ఇక బిల్లులు చెల్లించలేక అబ్బాయిలు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తు్న్నారు. ఇలా ముంబైలో పలు క్లబ్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: ‘భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది’.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
జర్నలిస్ట్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఆయా వ్యక్తులు తమకు ఎదురైన కష్టాలు, జరిగిన స్కామ్ గురించి పోస్ట్ చేసినప్పటికీ ముంబై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలని.. చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బిల్లులు చెల్లించకపోతే దారుణాతీదారుణంగా బౌన్సర్లతో దాడి చేయిపిస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ డేటింగ్ స్కామ్‌పై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!