వృద్ధ దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. దారి మధ్యలో ఆకలి వేస్తోందని రోడ్డు పక్కన ఆపారు. భర్త వడాపావ్ తెచ్చేందుకు దుకాణంలోకి వెళ్లాడు. భార్య స్కూటీ దగ్గరే నిలబడింది. ఇద్దరు కంత్రీగాళ్లు ఆమె చుట్టే తిరుగుతున్నారు.
జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ సభ్యులు ఈ ఆలోచనను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 1న కాకుండా అక్టోబర్ 5కు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాల విడుదలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
ఒక ఈవ్‌టీజర్‌కు నడిరోడ్డుపైనే ఇద్దరు యువతులు బుద్ధి చెప్పారు. కారులో వెళ్తుండగా బుల్లెట్ రైడర్ వేడిపించాడు. అంతే అతగాడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కారు ఆపి.. యువకుడ్ని అడ్డుకున్నారు. దిగి దిగగానే ఈవ్‌టీజర్ చెంపలు వాయించారు. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు మొబైల్లో ఈ సీన్‌ను చిత్రీకరించాడు.
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వార్నింగ్ ఇచ్చింది. నగర వాసులెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేసింది.
అగ్ర రాజ్యం అమెరికాలో నేపాల్‌కు చెందిన మున పాండే అనే విద్యార్థినిని భారత సంతతికి చెందిన దోపిడీదారుడు పొట్టనపెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే హత్యకు గురైంది. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో పాండే మంచం మీదే శవమై కనిపించింది.
పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు దగ్గర అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు తెలిపారు. కర్షకుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్‌ను పూలమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మీ కుమార్తె.. మీకు అండగా ఉంటుందని ప్రకటించారు.
అమెరికాలో మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్ర అలజడి చెలరేగింది. ట్రంప్ సభావేదికపైకి మాట్లాడుతుండగా ఓ అగంతకుడు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు.
వెనుజువెలా అత్యంత విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వెనుజువెలా రాజధాని కారాకస్‌తో పాటు దాదాపు 24 రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వెనుజువెలాలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.