బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఈ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ఆమోదించారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఆయనను విచారించేందుకు సీబీఐ అనుమతిని ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.
మహారాష్ట్రలోని పూణెలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. పూణె నగరంలోని బుద్వార్ పేత్ ప్రాంతంలోని సిటీ పోస్టాఫీసు ఆవరణలో ఒక డ్రైనేజీ ట్యాంకర్ ఉంది. ట్రక్కు పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కి చెందినది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగి ఉంది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 17 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు గేవ్రాయ్ నుంచి జాల్నాకు వెళ్తుండగా అంబాద్ నుంచి నారింజ పండ్లతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఓవర్టేక్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.
దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. దీంతో కొద్దిసేపు రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. దాదాపు 15-20 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు డీఎంఆర్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లేఖ రాసింది. కేజ్రీవాల్‌కు వసతి కల్పించాలని కోరింది. దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉండబోదని ఆశిస్తున్నట్లు ఆప్ పేర్కొంది.
గురుగ్రామ్‌లో కారు-బైక్ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాంగ్ రూట్లో కారు రావడంతో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న బైకర్ ఢీకొని 23 ఏళ్ల అక్షత్ గార్గ్ ప్రాణాలు వదిలాడు. రాంగ్ సైడ్‌లో ఎస్యూవీ కారును నడిపిన వ్యక్తికి వెంటనే బెయిల్ లభించింది. దీంతో అతడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటూ గురుగ్రామ్ ప్రమాద బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్‌లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్‌గా మారింది. నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింHamas
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు సరికొత్త జోష్ తీసుకొచ్చింది. ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. సరన్‌లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.