Gurugram Accident: కారు ఢీకొని బైకిస్టు మృతి.. డ్రైవర్‌కు బెయిల్ ఇవ్వడంపై బాధిత కుటుంబం ఆగ్రహం
- గురుగ్రామ్‌లో కారు.. బైక్ ప్రమాదం
- బైకిస్టు అక్షత్ (23) దుర్మరణం
- నిందితుడికి వెంటనే బెయిల్ ఇవ్వడంపై బాధిత తల్లి ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గురుగ్రామ్‌లో కారు-బైక్ ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాంగ్ రూట్‌లో కారు రావడంతో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న బైకర్ ఢీకొని 23 ఏళ్ల అక్షత్ గార్గ్ ప్రాణాలు వదిలాడు. రాంగ్ సైడ్‌లో ఎస్‌యూవీ కారును నడిపిన వ్యక్తికి వెంటనే బెయిల్ లభించింది. దీంతో అతడికి ఎందుకు బెయిల్ ఇచ్చారంటూ గురుగ్రామ్ ప్రమాద బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Supreme Court YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్.. షాకింగ్ వీడియో ప్రత్యక్షం!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
23 ఏళ్ల అక్షత్ గార్గ్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-2లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వేగంగా వెళ్తున్నాడు. అటువైపు నుంచి రాంగ్ రూట్‌లో వస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టాడు. అక్కడికక్కడే అక్షత్ చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్షత్ స్నేహితుడి బైక్‌పై అమర్చిన గోప్రో యాక్షన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎస్‌యూవీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… వెంటనే అతడికి బెయిల్ లభించింది.
ఇది కూడా చదవండి: Jasprit Bumrah: అరుదైన ఘనత సాధించిన టీమిండియా స్టార్ బౌలర్..
ఢిల్లీలోని ద్వారకలో అక్షత్ నివాసముంటున్నాడు. హెల్మెట్, గ్లౌజులు ధరించి బైక్‌పై వెళుతున్న దృశ్యం వీడియోలో కనిపించింది. వేగంగా వెళ్తూ మలుపు తీసుకుంటుండగా అకస్మాత్తుగా రాంగ్ సైడ్ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఆ వేగంలో ఢీకొనడంతో అక్షత్ మృతిచెందాడు. కారు ముందు భాగంగా ధ్వంసమైంది.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: ఒకేసారి రూ.2000 పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే..
BNS సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. నిందితుడిని చట్ట ప్రకారం అరెస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులు ఆగస్ట్ 2024లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినందుకు 16,000+ చలాన్‌లు కూడా జారీ చేశారు. కఠిన చర్యలు కొనసాగుతాయని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఎస్‌యూవీ డ్రైవర్‌కు బెయిల్ ఇవ్వడంపై అక్షత్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘నా కొడుకుకు న్యాయం జరగాలి. తప్పులో ఉన్న వ్యక్తి నా కొడుకును చంపాడు. బెయిల్‌పై ఎందుకు విడుదలయ్యాడు అనేది నా ఏకైక ప్రశ్న? నా కొడుకు వెళ్లిపోయాడు కానీ అతను (నిందితుడు) ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు … పోలీసులు మాకు సహాయం చేయలేదు?’’ అని ఆమె ప్రశ్నించింది. పోలీసులు వేగంగా స్పందించి అంబులెన్స్‌లో తీసుకెళ్లినా అక్షత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఎస్‌యూవీ డ్రైవర్ కుల్దీప్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు.
#WATCH | Gurugram: Mother of the biker who died in a collision, says "I want justice for my son. A wrong person killed my son. My only question is why was he released on bail? My son is no more but he (accused) slept peacefully that night…Why is the police not helping us?…" https://t.co/bCxHyGbu82 pic.twitter.com/FJslZ5TVke
— ANI (@ANI) September 20, 2024
#WATCH | Haryana: A biker dies after a collision with a car driving from the wrong side, in Gurugram
FIR has been registered under relevant sections of BNS and the accused has been arrested as per law. Gurugram Police issued 16,000+ challans for wrong-side driving in August… pic.twitter.com/w040AiYkCK
— ANI (@ANI) September 20, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!