Bihar: బీహార్‌లో విషాదం.. ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి
- బీహార్‌లో విషాదం
- ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. సరన్‌లో ఆలయం గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న కథియా బాబా ఆలయ సరిహద్దు గోడ గురువారం కూలిపోయింది. గోడ సమీపంలో వరద నీటిలో స్నానం చేస్తున్న ముగ్గురు పిల్లలపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. జేసీబీతో శిథిలాల తొలగింపునకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
గాయపడ్డ చిన్నారి ఛప్రాలోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు బలగాలను నియమించారు. ఘటనా స్థలంలో ఉన్నతాధికారులు మకాం వేశారు. శాంతిభద్రతల పరిస్థితి సాధారణంగా ఉందని సరన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
#WATCH | Visuals from Bihar's Saran where the boundary wall of Kathia Baba temple, Rupganj collapsed and fell on 3 children who were bathing in flood water near the wall.
Two children lost their lives and one other child was injured in the incident. pic.twitter.com/Yqvk6wAplN
— ANI (@ANI) September 19, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!