US-Israel: ఇజ్రాయెల్‌కు అమెరికా అలర్ట్.. ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక
- ఇజ్రాయెల్‌కు అమెరికా అలర్ట్
- ఇరాన్ క్షిపణి దాడి చేయొచ్చని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంకర్‌లో 60 అడుగుల లోతులో అత్యంత భద్రంగా ఉన్న నస్రల్లాను ఇజ్రాయెల్ బంకర్ బస్టర్‌ను ఉపయోగించి అంతమొందించింది. దీంతో లెబనాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మూల స్తంభం కూలిపోవడంతో హిజ్బుల్లా అయోమయానికి గురైంది. అంతేకాకుండా యావత్తు ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేసింది. నస్రల్లా మరణం తర్వాత ప్రపంచమంతా ఒకటే చర్చ జరిగింది. ఇజ్రాయెల్ ఎలా చంపగలిగింది? అన్న చర్చే నడిచింది.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ కారాలు, మిరియాలు నూరుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అగ్ర రాజ్యం అమెరికా.. ఇజ్రాయెల్‌ను అలర్ట్ చేసింది. ఏ క్షణంలోనైనా ఇరాన్ క్షిపణి దాడిని చేయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు యూఎస్ అధికారి అలర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సూచనలు ఉన్నాయని వైట్ హౌస్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని వైట్‌హౌస్ వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: China President: మున్ముందు చైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది..
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా పెట్టుకుని సాగిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం.. మంగళవారం కూడా దాడులు కొనసాగించింది. బీరుట్ ప్రాంతంలో బాంబుల మోతతో దద్దరిల్లింది. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. మరోవైపు ఇరాన్ దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: New Liquor Policy: 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!