ఖరీదైన ఫోన్లు ఉచితంగా కొట్టేందుకు ఏకంగా డెలివరీ బాయ్‌నే లేపేశారు ఇద్దరు కేటుగాళ్లు. మొత్తానికి పాపం పండి కటకటాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
లక్నోకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. రూ.90,000 వేల ఖరీదైన రెండు ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో బుక్ చేసుకున్నారు. కానీ వారిద్దరి దగ్గర డబ్బులు లేవు. కానీ ఫోన్లు తమ సొంతం చేసుకోవాలని కుట్ర పన్నారు. అంతే డెలివరీ బాయ్‌ను చంపేశారు. ఛార్జర్ తాడుతో గొంతు కోసి ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాన్ని బాధితుడి బ్యాగ్‌లో పెట్టి కాలువలో పడేశారు. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ భరత్ కుమార్ తప్పిపోయాడనే ఫిర్యాదు సెప్టెంబర్ 26న లక్నోలోని చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. పలువురిని విచారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో ఒక నిందితుడును అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: SEBI: వీడియోకాన్ కేసులో ధూత్‌కు షాక్.. రూ.కోటి నోటీసు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో అనేక అనుమానాస్పద విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. డెలివరీ చేయని ఆర్డర్‌లతో సహా ఫ్లిప్‌కార్ట్ నుంచి బాధితుడు కుమార్ అందించే డెలివరీల వివరాలను సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా చాలా మందిని ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణ తర్వాత తన సహచరుడు గజానన్‌తో కలిసి కుమార్‌ని చంపినట్లు ఆకాష్ శర్మ ఒప్పుకున్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఎంపికను ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 90,000 ఖరీదు చేసే Vivo V40 Pro మరియు Google Pixel 7 pro అనే రెండు సెల్‌ఫోన్‌లను ఆర్డర్ చేయడానికి శర్మ తన స్నేహితుల్లో ఒకరి ఫోన్‌ని ఉపయోగించారని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: LPG cylinder: వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే..!
‘‘కుమార్ డెలివరీ కోసం ఇంటికి చేరుకున్నప్పుడు.. శర్మ, గజానన్ అత్యాశకు గురై డబ్బు చెల్లించకుండా ఇతరులకు డెలివరీ చేయాల్సిన ఫోన్లు, ఇతర వస్తువులను పొందాలని ఆలోచించారు. వారు కుమార్‌ను లోపలికి రమ్మని చెప్పి.. ఆపై అతనిని గొంతు కోసి చంపారు. అనంతరం ఫ్లిప్‌కార్ట్ బ్యాగ్‌లో కుక్కి ఇందిరా నగర్ కాలువలో పడేశారు’’ అని శశాంక్ సింగ్ చెప్పారు. నిందితుడు శర్మ నేరాన్ని అంగీకరించడంతో మంగళవారం అరెస్టు చేశామని, డెలివరీ చేయడానికి ఉద్దేశించిన రెండు ఫోన్‌లు, మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
‘‘జాతీయ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలకు చెందిన బృందాలు మరియు స్థానిక డైవర్లు మృతదేహాన్ని గుర్తించడానికి ప్రయత్నించారని.. గజానన్ పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. కుమార్‌కు వివాహమై 8 సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Musi River : బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌పై మినిట్స్ విడుదల