జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం చివరి విడత పోలింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివచ్చారు. ఎన్నికల సంఘం పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెప్టెంబర్ 18న జరిగింది. సెకండ్ విడత పోలింగ్ సెప్టెంబర్ 25న జరిగింది. ఇక చివరి విడత అక్టోబర్ 1న 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు భారీగా ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Dera baba: హర్యానా ఎన్నికల వేళ డేరా బాబా విడుదల.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ
గత రెండు విడతల్లో నమోదైన ఓటింగ్ కంటే.. చివరి విడతలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 65.48% పోలింగ్ నమోదైందని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఓటర్లు ఉత్సాహంగానే వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అక్టోబర్ 5న సాయంత్రం 5 గంటల వరకు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఆ ఎన్నికలు ముగిశాకే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాల్సి ఉంటుంది.
Election Commission of India says, "Elections to the phase 3 of the Assembly Elections in J&K recorded 65.48% polling as of 5 PM today which is going to surpass the Lok Sabha 2024 voter turnout in these 7 districts which was 66.78%. The voter turnout in Phase 1 and Phase 2 of the…
— ANI (@ANI) October 1, 2024
J-K polls: 65.48 pc voter turnout till 5pm in phase 3; Udhampur records highest
Read @ANI Story l https://t.co/yJNLjqiTmQ
#JammuandKashmirpolls#ECI pic.twitter.com/anAtGGQUmR— ANI Digital (@ani_digital) October 1, 2024