ఇటలీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్, సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఘోర ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయం నుంచి గురువారం ర్యాన్‌ఎయిర్ బోయింగ్ 737-8AS విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. టేకాఫ్ అయ్యేలోపే ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి. పైలట్ కుడి ఇంజిన్‌లో మంటలను గుర్తించి టేకాఫ్‌ను నిలిపివేసినట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా కిందకు దించేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన కారణంగా బ్రిండిసి పపోలా కాసలే విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేసేశారు. ఇంజన్‌లో లోపాలు తలెత్తడంతోనే ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటలు చెలరేగినప్పుడు విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను చూసి పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే గగనతలంలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు జరిగేది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.