ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు. కేజ్రీవాల్, తన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడితో కలిసి కారులో ఇంటి నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులు, కుమార్తె మరొక వాహనంలో కొత్త ఇంటికి వెళ్లారు. ఫిరోజ్‌షా రోడ్‌లోని పార్టీ సభ్యుడు అశోక్ మిట్టల్ అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. పార్టీ కార్యక్రమాలకు, ప్రజలకు అందుబాటలో ఉంటుందన్న కారణంతో ఈ ఇల్లును కేజ్రీవాల్ కుటుంబం ఎంచుకుంది.
ఇది కూడా చదవండి: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
ఢల్లీ లిక్కర్ పాలసీ కేజులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించారు. సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరు నెలల తర్వాత ఇంటికి చేరుకున్నారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ ప్రజల మనసులు గెలుచుకున్నాకే తాను తిరిగి పదవిని చేపడతానని ఆయన ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Boat Capsizes: పడవ బోల్తా.. 78 మంది మృతి!
కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానాన్ని అతిషితో భర్తీ చేశారు. సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ మాజీ కావడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. అయితే కొద్ది రోజులుగా హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో శుక్రవారం ఇల్లు ఖాళీ చేశారు. అందరికీ అందుబాటులో ఉండేందుకు సొంత పార్టీ నేత అశోక్ మిట్టల్ ఇంట్లోకి మకాం మార్చారు.
ఇది కూడా చదవండి: War 2 : భారీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మాస్ సాంగ్..
#WATCH | Delhi: Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal vacated the CM residence along with his family, earlier today.
(Source: AAP) pic.twitter.com/vQEy61Bjm8
— ANI (@ANI) October 4, 2024
Delhi: Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal vacated the CM residence along with his family, earlier today.
(Source: AAP) pic.twitter.com/aEoPC0mbme
— ANI (@ANI) October 4, 2024
#WATCH | Delhi: Former Delhi CM and AAP National Convenor Arvind Kejriwal reaches his new residence along with his family. pic.twitter.com/2v8cTxnuNl
— ANI (@ANI) October 4, 2024