తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్ బావ మురసోలి సెల్వం కన్నుమూశారు. గురువారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సీఎం స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బెంగళూరు వెళ్లారు. మురసోలి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్.. బావ భౌతికకాయంపై పడి ఎక్కి ఎక్కి ఏడ్చారు.
ఇది కూడా చదవండి: Mr Celebrity: ‘మిస్టర్ సెలెబ్రిటీ’ విజయం.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
85 ఏళ్ల మురసోలి సెల్వం గతంలో తమిళ దినపత్రిక మురసోలికి ఎడిటర్‌గా పని చేశారు. మురసోలి పత్రిక డీఎంకే పార్టీ అధికారిక గొంతుకగా పేరుపొందింది. మురసోలి.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు. సెల్వం… కరుణానిధి కుమార్తెనే వివాహం చేసుకున్నారు. అంతేకాదు సెల్వం… కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌కు తమ్ముడు. సెల్వం భౌతికకాయానికి నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ భార్య సంగీత సోర్నలింగం కూడా నివాళులర్పించారు
#WATCH | Tamil Nadu CM MK Stalin paid tribute to former editor of 'Murasoli' newspaper and his brother-in-law Murasoli Selvam, in Chennai.
(Source: DMK) pic.twitter.com/mvzHxOHMFF
— ANI (@ANI) October 10, 2024
#WATCH | Actor and TVK President Vijay's wife Sangeetha Sornalingam paid last respect to Tamil Nadu CM MK Stalin's brother-in-law Murasoli Selvam in Karunanidhi Residence, Chennai. pic.twitter.com/GjNolX7UJs
— ANI (@ANI) October 10, 2024
#WATCH | Chennai: Tamil Nadu Chief Minister M K Stalin's brother-in-law Murasoli Selvam passed away in Bangalore
CM Stalin, Deputy CM Udhayanidhi Stalin pay last respects pic.twitter.com/SaEnuXxKk3
— ANI (@ANI) October 10, 2024