Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
- సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు
- జాబ్ నుంచి తొలగించిన ఎటియోస్ సర్వీసెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
నికిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఎటియోస్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియాలో ఒక వివాహిత దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మహిళ భర్త ప్రభుత్వాధికారులకు షేర్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్‌షాట్ కంపెనీ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు దిగింది. ఇది ఆమోదయోగ్యం కాదని.. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
‘‘ఇది చాలా తీవ్రమైనది. @DgpKarnataka, @CMofKarnataka, @DKShivakumar. బట్టల ఎంపికపై నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి’’ అని షాబాజ్ అన్సార్ ట్వీట్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ‘‘నా భార్యను యాసిడ్ దాడితో బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను’’ అని షాబాజ్ అన్సార్ పేర్కొన్నాడు.
ఈ సంఘటనపై ఎటియోస్ సర్వీసెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి చర్య ఆమోదయోగ్యం కాదని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ఎటియోస్ సర్వీసెస్‌లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది.’’ అని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!