Lottery: జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. రూ.25 కోట్ల లాటరీ గెలిచిన అల్తాఫ్
- జాక్‌పాట్ కొట్టిన మెకానిక్
- రూ.25 కోట్ల లాటరీ గెలిచిన అల్తాఫ్
- టికెట్ స్నేహితుడికి ఇవ్వబోతే అడ్డుకున్న భార్య
- అదే టికెట్ రూ.25 కోట్ల బహుమతి గెలుచుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది అప్పుడప్పుడు కష్టాలొచ్చినప్పుడు ఏదైనా లాటరీ తగిలితే బాగుండును బాధలన్నీ తీరిపోతాయని అనుకుంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా అనుకోవడం సహజమే. కానీ అదే నిజమైంది ఓ కుటుంబానికి. లక్ష కాదు.. రెండు లక్షల కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయారు.
కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టికెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి రెండు టికెట్లు కొనుగోలు చేశాడు. ఇలా 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఈ ఏడాది కూడా ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు రూ.500 చొప్పున కొనుగోలు చేశాడు. ఓ టికెట్ స్నేహితునికి ఇవ్వాలనుకున్నాడు. కానీ భార్య అడ్డుకుంది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. అర్ధాంగి అడ్డుకున్నట్టుగానే ఆ టికెట్ రూ.25 కోట్ల బహుమతి గెలుచుకుంది. దీంతో ఎగిరి గంతులేశారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఇది కూడా చదవండి: Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..
లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు. బెంగళూరులో సెటిలవుతానని.. తన కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పులన్నీ తీర్చేస్తానని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Devara: దేవర కలెక్షన్స్.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?