ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం మోడీ లావోస్ వెళ్లారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం-ఆసియాన్ స్నేహం ముఖ్యమైనదన్నారు. వచ్చే 2025వ ఏడాది ఆసియాన్-భారత పర్యాటక సంవత్సరమని తెలిపారు. 10 సంవత్సరాల క్రితం యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రకటించినట్లు తెలిపారు. ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నామన్నారు.
ఇది కూడా చదవండి: Viswam : శ్రీను వైట్ల స్టైల్‌లో విశ్వం.. అదే అసలు హైలైట్ : నిర్మాత వేణు దోనేపూడి ఇంటర్వ్యూ
2019లో ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాల ప్రస్తావిస్తూ.. గతేడాది ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం సముద్ర కార్యక్రమాలు ప్రారంభించినట్లు మోడీ తెలిపారు. గత దశాబ్దంలో ఆసియాన్ దేశాలతో భారతదేశ వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లకుపైగా ఉందన్నారు. 10 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేస్తామని.. భారత్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియాన్ విద్యార్థులకు కొత్త గ్రాంట్లు ఇస్తామని అన్నారు.
ఇది కూడా చదవండి: Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో సినిమా రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?
ప్రధాని మోడీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. మోడీకి ఎన్నారైలు జాతీయ జెండాలు, కళాకృతులు అందజేశారు. అనంతరం స్థానిక యువకులతో కలిసి ప్రధాని మోడీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. బౌద్ధ భిక్షువులతో కలిసి ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు.లావోస్ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు.
PM Narendra Modi participated in the 21st ASEAN-India Summit in Vientiane, Lao PDR, today. In the 10th year of the Act East Policy, PM announced a 10-point plan to strengthen connectivity and resilience based on the theme of ASEAN Chair 2024, including physical, digital,… pic.twitter.com/acDHohIo1h
— ANI (@ANI) October 10, 2024