దేశంలోనే ప్రధాన నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోడ్డుపైకి వచ్చామంటే.. ఎప్పుడు ఇంటికి చేరుతామో.. ఎప్పుడు ఆఫీస్‌కు వెళ్తామో ఎవరికీ తెలియదు. అంతగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. అందుకోసమే రద్దీని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. పీక్ సమయంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు రద్దీ పన్నును ప్రవేశపెట్టాలని ఢిల్లీ సర్కార్ యోచిస్తోంచి. పైలట్ ప్రాజెక్ట్ కింద 13 కీలక సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారిస్తోంది.
ఇది కూడా చదవండి: Iran: “ఇజ్రాయిల్‌కి సాయం చేయవద్దు, లేదంటే”.. సౌదీ, యూఏఈలకు ఇరాన్ వార్నింగ్..
ఢిల్లీలో అత్యవసర సమయాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిష్కారం లభించడం లేదు. అందుకోసం సరికొత్త వ్యూహంతో నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ట్యాక్స్ ఆలోచనతో ముందుకొస్తోంది. ఢిల్లీ కంజెషన్ ట్యాక్స్ ప్రకారం రద్దీ సమయంలో ఎంపిక చేసిన రోడ్డు మీద ప్రయాణిస్తే అదనంగా కొత్త ట్యాక్స్ కట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విధంగానైనా రద్దీ తగ్గుతుందని సర్కార్ భావిస్తోంది. ఈ విధానంతో నగర శివార్లలోనే వాహనాలను నియంత్రించొచ్చని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు లాంటి నగరంలో అమల్లో ఉంది. విజయవంతంగా అమలవుతోంది. దీంతో కొంత మేర ట్రాఫిక్ నియంత్రణలో ఉంది. అంతేకాకుండా సింగపూర్, లండన్, స్టాక్‌హోమ్ వంటి నగరాల్లో విజయవంతంగా అమలవుతోంది. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి అదనంగా పన్ను విధించడంతో రద్దీ నియంత్రణలోకి వచ్చింది. అదే విధానాన్ని ఢిల్లీలో కూడా అమలు చేస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రవాణా ప్రత్యేక కమీషనర్ షాజాద్ ఆలం తెలిపారు.
ఇది కూడా చదవండి: Face Care : ముఖంపై ముడతలు మీ అందాన్ని పాడుచేస్తున్నాయా..? కొన్ని చిట్కాలు..!
ఇదిలా ఉంటే ఢిల్లీలో సదరు “రద్దీ పన్ను” ప్రతిపాదన కొత్త విషయం కాదు. 2018లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్లపైకి ప్రవేశించే వాహనాలకు ఛార్జ్ వసూలు చేయాలని ఆయన ప్రతిపాదించారు. నాడు.. ప్రభుత్వం నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని కోరుతామని బైజల్ పేర్కొన్నారు. ఐటీఓ కూడలి, మెహ్రౌలి-గుర్గావ్ రోడ్డు సహా 21 హై ట్రాఫిక్ ప్రాంతాలను పన్నుకు అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. 2017లో పార్లమెంటరీ కమిటీ కూడా రాజధానిలో రద్దీగా ఉండే ప్రాంతాలపై టోల్ విధించాలని సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: Thummala Nageswara Rao: తల తాకట్టు పెట్టి అయినా పంట బీమా పథకం ఇప్పిస్తాం..