అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది రోజుల్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లో సందడి చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి స్వయంగా వడ్డించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
ట్రంప్ వెళ్లిన మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్ మేనేజర్ ఆదేశాలు బయటికి వెళ్లడమే కారణం. ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా అవుట్‌లెట్ మూసి ఉంటుందని మేనేజర్ చెప్పినట్లుగా ఉంది. అయితే ట్రంప్ రాకకు వీలుగా అవుట్‌లెట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ ఆదేశాల కాపీ సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌డొనాల్డ్‌లో జరిగింది కేవలం షో అని, సహజంగా జరిగింది కాదని డెమొక్రాట్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.