No Romance in Cab: క్యాబ్‌లో రొమాన్స్ చేయకండి.. డ్రైవర్ వార్నింగ్
- హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ వార్నింగ్ బోర్డు
- క్యాబ్‌లో నో రొమాన్స్ అంటూ హెచ్చరిక
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాబ్‌లో ఎక్కే జంటలతో ఎంత విసుగుపోయాడో.. ఏంటో తెలియదు గానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ సంచలన నిర్ణయమే తీసుకున్నాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదంటూ వార్నింగ్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్.. వార్నింగ్ అంటూ కారులో తన సీటు వెనుక బోర్డు పెట్టాడు. క్యాబ్‌లో నో రొమాన్స్ అంటూ రాసిపెట్టాడు. ఏదైనా ప్రైవేటు స్థలంలోనైనా.. లేదంటే ఓయో హోటల్స్‌లోనైనా రొమాన్స్ చేసుకోవాలంటూ సూచించాడు. తన కారులో మాత్రం దూరం పాటించాలని హెచ్చరించాడు. ముఖ్యంగా జంటలను ఉద్దేశించి ఈ బోర్డు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
క్యాబ్ డ్రైవర్ ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చిన బోర్డు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ప్రయాణికులు ప్రశాంతంగా ఉండాలని.. ఒకరికొకరు దూరం పాటించాలని సలహా ఇచ్చాడు. ప్రత్యేకంగా జంటలను ఉద్దేశించి ఈ సందేశం ఉంచాడు. తన క్యాబ్‌లో శృంగారానికి చోటు లేదన్నాడు. వెంకటేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా… ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు నైతికంగా, అవసరమైన సందేశం అని తెలిపాడు. మరొకరు.. ఇలాంటి బోర్డులు బెంగళూరు, ఢిల్లీలో చూశానని.. హైదరాబాద్‌లో కూడా ఇంత త్వరగా రావడం ఊహించలేదన్నారు. ఇదిలా ఉంటే గత వారమే బెంగళూరు క్యాబ్ డ్రైవర్ కూడా ఇదే రకమైన బోర్డు పెట్టడంతో వైరల్ అయింది.
తాజావార్తలు
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!