Akhilesh Yadav: లక్నోలో మ్యాచ్ రద్దుకు బీజేపీనే కారణం.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
- భారత్- దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంపై అఖిలేష్ యాదవ్ ఫైర్..
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా చేరింది.. దీనికి కారణం బీజేపీనే..
- లక్నోలో స్వచ్ఛమైన గాలి కోసం నిర్మించిన పార్కులను బీజేపీ సర్వనాశనం చేసింది: అఖిలేష్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: లక్నోలో జరగాల్సిన భారత్- దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంపై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పెరిగిన కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా చేరింది.. అందుకే ఈ మ్యాచ్ జరగలేదన్నారు. ఇది పొగ వల్ల కాదు, కాలుష్యంతో ఏర్పడిన స్మాగ్ కారణంగానే మ్యాచ్ రద్దయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ముఖాలను కప్పుకోవాలని తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సూచించారు. కాగా, లక్నోలో స్వచ్ఛమైన గాలి కోసం మేము నిర్మించిన పార్కులను బీజేపీ ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్ల పేరుతో నాశనం చేస్తోంది.. బీజేపీ నేతలకు మనుషులపై, పర్యావరణంపై కూడా ప్రేమ లేదని ఆరోపించారు. లక్నోలోని ప్రజలు ఇప్పుడు తమ ముఖాలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
- PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
- Special Trains: పండుగ సీజ్‌లో రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
అయితే, బుధవారం సాయంత్రం లక్నోలోని భారత్‌రత్న అటల్ బిహారీ వాజపేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, టాస్ 7 గంటలకు జరగాల్సింది. కానీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆరు సార్లు పిచ్ ను పరిశీలించినప్పటికీ ఆట ప్రారంభించలేమని నిర్ణయించారు. చివరికి రాత్రి 9.25 గంటలకు పరిశీలించి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేసేశారు. ఇక, మ్యాచ్ రద్దుతో స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
दिल्ली का प्रदूषण अब लखनऊ तक पहुँच गया है। इसीलिए लखनऊ में आयोजित होनेवाला अंतरराष्ट्रीय क्रिकेट मैच नहीं हो पा रहा है। दरअसल इसकी वजह कोहरा या फ़ॉग नहीं, स्मॉग है।
हमने जो पार्क लखनऊ की शुद्ध हवा के लिए बनवाए थे, भाजपा सरकार वहाँ भी इंवेटबाजी करवाकर उन्हें बर्बाद करना चाहती… pic.twitter.com/X71TvretcV
— Akhilesh Yadav (@yadavakhilesh) December 17, 2025
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!