దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మొదటిసారిగా 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 14 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అని ఐఎండీ పేర్కొంది. 1987 డిసెంబర్ 6న 4.1 డిగ్రీల సెల్సియస్ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ గుర్తుచేసింది. బుధవారం చలిగాలులు ఢిల్లీని తాకాయని.. రానున్న రెండు రోజుల పాటు ఇలాంటి చలిగాలులు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బుధవారం రాత్రి సాధారణం కంటే 4.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని స్పష్టం చేసింది. వాయువ్య దిశ నుంచి గంటకు 8-10 కి.మీ వేగంతో వీస్తున్న ఉపరితల గాలుల కారణంగానే ప్రస్తుత ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: కుటుంబంలో పెను వివాదం.. మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం
ఐఎండీ డేటా ప్రకారం.. 2022, 2023 డిసెంబర్‌లో ఇంతగా సెల్సియస్ పడిపోయిన రోజులు లేవని తెలిపింది. 2020లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 7.5 డిగ్రీల సెల్సియస్‌కు నమోదైనట్లుగా పేర్కొంది. డిసెంబరు 11-13 మధ్య ఢిల్లీలో తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇక తేమ 64-39 శాతం మధ్య హెచ్చుతగ్గులకు గురవుతుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో పొగమంచు కనిపించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?