పీఎఫ్ ఖాతాదారులకు కార్మికశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నగదు విత్‌డ్రాను మరింత సులభతరం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీఎఫ్ కస్టమర్లు ఇకపై ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా తెలిపారు. జనవరి, 2025 నుంచి ఏటీఎంల ద్వారా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి: Maharaja : చైనాలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న’మహారాజా’
లబ్ధిదారు, బీమా చందాదారులు ఏటీఎంల ద్వారా క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సుమితా దావ్రా పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన ఐటీ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోందన్నారు. క్లెయిమ్‌లు వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం అని చెప్పారు. ఏటీఎంల ద్వారా చందాదారులు, లబ్ధిదారులు ఈ నగదును సులభంగా తీసుకోవచ్చన్నారు.
ఇది కూడా చదవండి: KTR : రాహుల్‌కు కేటీఆర్ లేఖ..