దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. అనంతరం కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీల్లో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇలాంటి అవరోధాలే ఏర్పడుతున్నాయి.
సెన్సెక్స్ అస్థిరత మధ్య సాగుతుండగా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. ఐటీ షేర్లు మాత్రం మెరిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు పతనమయ్యాయి. నిఫ్టీలో హిందాల్కో, ఓఎన్‌జిసి, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా లాభపడగా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ మరియు ట్రెంట్ నష్టపోయాయి.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, టైటాన్, ఎల్‌అండ్‌టీ, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.