భారత్‌ను ఇప్పటికే చలి గాలులు హడలెత్తిస్తున్నాయి. ఇప్పుడు దీనికి వర్షాలు కూడా తోడయ్యాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు, చలిగాలులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అండమాన్ మరియు నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో చలిగాలుల చాలా తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rajinikanth Birthday: రామారావుతో రజనీ’బంధం’
ఇదిలా ఉంటే తమిళనాడులో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. ఇక భారీ వర్ష సూచన నేపథ్యంలో చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూర్, రాణిపేట్, తిరువళ్లూరు సహా వివిధ జిల్లాల్లోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ దృష్ట్యా పుదుచ్చేరి, కారైకల్‌లో రెండు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Hajj Yatra: హజ్ యాత్రకు పది వేల మందికీ అవకాశం.. కమిటీ చరిత్రలో ఇదే తొలిసారి..